: మాధురీదీక్షిత్ ను టెన్షన్ పెట్టిన సంజయ్ దత్!
బాలీవుడ్ నటీనటులు మాధురీదీక్షిత్, సంజయ్ దత్ ల మధ్య కొనసాగిన ప్రేమాయణం గురించి తెలిసిందే. ఒకానొక సమయంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. అప్పటికే, సంజూకి పెళ్లి కూడా అయింది. అయితే, సంజయ్ దత్ జైలుకు వెళ్లడంతో, వారు పెళ్లి చేసుకోలేకపోయారు.
ప్రస్తుతం సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కబోతోంది. సంజయ్ పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తుండగా, అతని తండ్రి సునీల్ దత్ క్యారెక్టర్ ను పరేష్ రావల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాను రాజ్ కుమార్ హిరాణీ నిర్మిస్తున్నాడు. అయితే, ఈ బయోపిక్ లో మాధురీదీక్షిత్ పాత్రను కూడా పూర్తి స్థాయిలో చూపించాలనుకున్నారట. ఇప్పుడు ఇదే విషయం మాధురీదీక్షిత్ ను టెన్షన్ కు గురి చేస్తోందట. దీంతో, ఆమె తన మాజీ లవర్ సంజయ్ దత్ ను కలిసింది. తనకు పెళ్లై, పిల్లలు కూడా పుట్టారని... పిల్లలు పెద్దవాళ్లు అయ్యారని... మరొకరి భార్య అయిన తన గురించి సినిమాలో పెట్టవద్దని ఆమె కోరిందట. దీంతో, సంజూ సీన్ లోకి వచ్చి, సదరు సినిమా స్క్రిప్ట్ లో ఆమె పాత్రను తొలగింపజేశాడట.