: నా స్టామినా ఎవరికీ తెలియదు.. కావాలనుకుంటే వారం రోజుల్లో ట్రంప్ తో ఫొటో దిగి వస్తా: నిర్మాత బండ్ల గణేష్
తన శక్తి ఏంటో, సర్కిల్ ఏంటో ఎవరికీ తెలియదని... కావాలనుకుంటే వారం రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫొటో దిగి రాగలనని సినీ నిర్మాత బండ్ల గణేష్ తెలిపాడు. తన స్టామినా చాలా ఎక్కువని అన్నారు. హీరో సచిన్ జోషితో 'నీ జతగా నేనుండాలి' అనే సినిమాను చేయడమే తన జీవితంలో తాను చేసిన పెద్ద తప్పు అని తెలిపాడు. తన స్నేహితుడి కోరిక మేరకు తన బ్యానర్ పేరును ఆ సినిమాకు ఇవ్వడానికి తాను ఒప్పుకున్నానని చెప్పాడు. ఆ సినిమాకు పెట్టుబడి అంతా ఆయనే పెట్టుకున్నాడని... అయితే, ఆ సినిమా ఫ్లాప్ అయితే, తన వద్ద నుంచి డబ్బులు గుంజాలని ప్రయత్నించాడని తెలిపారు. 'నేనేమైనా పిచ్చోడినా? సచిన్ జోషి లాంటి వాడితో నేను సినిమా తీస్తానా?' అని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో, తమ మధ్య విభేదాలు తలెత్తాయని, తనను జైల్లో పెట్టిస్తానని కూడా బెదిరించాడని... జైల్లో కలుద్దామని ట్వీట్ చేశాడని బండ్ల తెలిపాడు.