: ఎయిర్‌టెల్ ప్ర‌క‌ట‌న‌ల‌పై జియో మండిపాటు.. భారీ జ‌రిమానా విధించాల‌ని ట్రాయ్‌కు ఫిర్యాదు


టెలికం రంగంలో సంచ‌ల‌నాల‌కు తెర‌లేపిన జియో.. ఎయిర్‌టెల్ ప్ర‌క‌ట‌నల‌పై ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. వినియోగ‌దారులను త‌ప్పుదోవ పట్టించేలా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్న భార‌తీ ఎయిర్‌టెల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. తాము ప్ర‌మోష‌న‌ల్ ఆఫ‌ర్‌లో భాగంగా అందిస్తున్న డేటా విష‌యంలో ఎయిర్‌టెల్ అతిగా ప్ర‌చారం చేస్తోంద‌ని ఫిర్యాదు చేసింది. అది ఇస్తున్న‌ యాడ్లు ఆరోగ్య‌క‌రంగా లేవ‌ని పేర్కొంది. త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న ఎయిర్‌టెల్‌పై భారీగా జరిమానా విధించాల‌ని కోరింది. ట్రాయ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన ఎయిర్‌టెల్ ఫ్రీ యూసేజ్ పాల‌సీ(ఎఫ్‌యూపీ) గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేద‌ని, వినియోగ‌దారులు ఫోన్ చేస్తేనే వివ‌ర‌ణ ఇస్తోంద‌ని, ఇది ట్రాయ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని ఫిర్యాదులో పేర్కొంది.

  • Loading...

More Telugu News