: నెల్లూరు జిల్లా ఖజానా కార్యాలయంలో నిధుల గోల్‌మాల్.. సొంత ఖాతాల్లోకి లక్షలాది రూపాయలు తరలించిన ఉద్యోగి
నెల్లూరు జిల్లా ఖజానా కార్యాలయంలో నిధుల గోల్‌మాల్ జరిగింది. ఖజానాలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరు కటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.17.40 లక్షలు తరలించాడు. విషయం తెలిసిన డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ విచారణ ప్రారంభించింది. బయటపడిన రూ.17.40 లక్షలే కాకుండా మరికొంత నగదు కూడా దారి మళ్లినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా ట్రెజరీ కార్యాలయం జాగ్రత్త పడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.