: నెల్లూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం.. 50 వేల మాస్క్‌లు సిద్ధం చేసిన అధికారులు
నెల్లూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. స్వైన్ ఫ్లూ భయంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జిల్లాలోని తడ, ఓజిలిలో మూడు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. 50 వేల మాస్క్‌లు సిద్ధం చేశారు. స్వైన్ ఫ్లూ మరింత వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు.