: ఘోర తప్పిదం చేసిన ట్రంప్ కార్యాలయం... బ్రిటన్ ప్రధాని పేరుకు బదులు పోర్న్ స్టార్ పేరు ప్రస్తావన!


డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే శ్వేతసౌధం ఘోరమైన తప్పిదం చేసింది. ఒక దేశ ప్రధానిని ఆహ్వానించాల్సిన శ్వేతసౌథం ఒక పోర్న్ స్టార్ ను ఆహ్వానించింది. త్వరలో బ్రిటన్ ప్రధాని యూఎస్ లో పర్యటించబోతున్నారంటూ శ్వేతసౌధం ఒక షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో మూడు సార్లు బ్రిటిష్ ప్రధాని పేరును ప్రస్తావించింది. ఈ మూడు సార్లు థెరెస్సామే పేరులోని 'హెచ్' అక్షరాన్ని వదిలేసింది. దీంతో అది 'టెరెస్సామే'గా (ఈ పేరుతో ఓ పోర్న్ స్టార్ వుంది) మారిపోయింది. దీంతో గతంలో ఇలాగే ఆమె వార్తల్లోకి వచ్చినట్టుగానే ఇప్పుడు కూడా ఆ పోర్న్ స్టార్ వార్తల్లో వ్యక్తి అయింది. మూడు సార్లు ఈ తప్పిదం దొర్లడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బ్రిటన్ ప్రధాని థెరెస్సామే తన అమెరికా పర్యటనలో ట్రంప్ తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడంతో పాటు, ఆయనతో సంయుక్త మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. 

  • Loading...

More Telugu News