: 'మీ నుంచే నేర్చుకున్నాను సర్' అంటూ అమితాబ్ కు సమాధానమిచ్చిన షారూఖ్!
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన అభినందన ట్వీట్ కు సమాధానమిచ్చిన షారూఖ్ ఖాన్ అభిమానుల ఆదరణ మరింత చూరగొన్నాడు. 'రయీస్' సినిమాపై సెలబ్రిటీలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రధానంగా షారూఖ్ నటనను అభినందిస్తూ అంతా ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆ సినిమా మొత్తంలో షారుక్ కోపంగా ఉన్నప్పుడు పండించిన హావభావాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అమితాబ్ అభినందించారు.
దీనికి ప్రతిస్పందించిన షారూఖ్... 'మీ నుంచే నేర్చుకున్నాను సర్' అంటూ సమాధానమిచ్చాడు. కాగా, తన కెరీర్ ప్రారంభంలో అమితాబ్ పలు చిత్రాలలో తన అభినయం ద్వారా 'యాంగ్రీ యంగ్ మేన్'గా పేరు తెచ్చుకున్నాడు. అందుకే, షారుఖ్ ఆ విధంగా కామెంట్ చేశాడు.