: నర్సంపేటలోని ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేసిన శునకం


వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందిని ఓ పెంపుడు శునకం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... నర్సంపేటలోని పోశమ్మ వీధికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానితో కుటుంబ సభ్యులకు అంతులేని అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రసాద్ కుమార్తె అక్షిత (రేణుక) సైకిల్ తొక్కుతూ కిందపడింది. దీంతో ఆమె పెదవికి తీవ్రగాయమైంది.

దానిని గమనించిన శునకం పరుగు పరుగున దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లింది. తొలుత దానిని పట్టించుకోని సిబ్బంది దానిని తరిమే ప్రయత్నం చేసినా, అది అక్కడే తిరుగుతూ హడావుడి చేసింది. ఇంతలో ప్రసాద్ తన కుమార్తెను తీసుకుని అదే ఆసుపత్రికి రావడంతో దాని ప్రయత్నం అక్కడి వారికి అర్థమైంది. దీంతో దాని విశ్వాసానికి ఆశ్చర్యపోయారు. అక్షితకు వైద్యమందిస్తున్న సమయంలో అది కంటనీరు పెట్టుకోవడంతో మరింత ఆశ్చర్యపోయారు. 

  • Loading...

More Telugu News