modi: మునిగిన నావ లాంటి కాంగ్రెస్ పార్టీలో మీరు అడుగుపెడతారా?: ప్రధాని మోదీ


పంజాబ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌లంధ‌ర్‌లో భార‌తీయ‌ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన ర్యాలీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మునిగిన నావ అని, అందులో ఎవరూ మిగలలేదని విమ‌ర్శించారు. అటువంటి దాంట్లో మీరు అడుగుపెడతారా? అని అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక‌పోవ‌డంతో నీళ్లుల్లో లేని చేప‌లాగ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయన విమ‌ర్శించారు. అధికారం కోసం తొంద‌ర‌ప‌డుతూ పొత్తులు పెట్టుకుంటోందని అన్నారు. పంజాబ్‌కి బాద‌ల్ మ‌ళ్లీ ముఖ్యమంత్రి కావాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు.

రాష్ట్ర‌ ప్ర‌తిష్టను దెబ్బ‌తీసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారని మోదీ విమ‌ర్శించారు. పంజాబ్ పోరాట యోధుల‌కు పుట్టినిల్లని ఆయ‌న అభివ‌ర్ణించారు. సింధూ న‌ది జ‌లాల‌ను రాష్ట్రానికి తీసుకువ‌స్తామ‌ని హామీ ఇచ్చారు. అవినీతిని అరిక‌డ‌తామ‌ని చెప్పారు. మాజీ సైనికుల‌ వ‌న్ ర్యాంక్‌, వ‌న్ పెన్ష‌న్ స్కీమ్‌పై నాటి కాంగ్రెస్ ఎన్నో హామీలు గుప్పించింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News