: గన్నవరం విమానాశ్రయం వద్ద ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులు
గన్నవరం విమానాశ్రయం వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడం కలకలం రేపుతోంది. విదేశాలకు చెందిన ఉగ్రవాదులు భారత్ లోకి వచ్చారని, అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి కీలకంగా మారిన గన్నవరం ఎయిర్ పోర్టు పరిసరాల్లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.