: సునామీని నియంత్రించవచ్చని చెబుతున్న శాస్త్రవేత్త!


సునామీని నియంత్రించవచ్చని అమెరికాలోని కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఉసామా ఖాద్రి తెలిపారు. ధ్వని గురుత్వాకర్షణ తరంగాల (ఏజీడబ్ల్యూ) సాయంతో సునామీ తరంగాలు తీరాన్ని తాకకముందే దాని తీవ్రతను నియంత్రించవచ్చని అన్నారు. ఏజీడబ్ల్యూ తరంగాలు సముద్రం లోపలికి చొచ్చుకుని వెళ్లగలవని, ఉపరితలం కింద వేల మీటర్ల వరకు ప్రయాణించగలవని ఆయన తెలిపారు. దీంతో వీటి సహాయంతో సునామీ తీవ్రత, వ్యాప్తిని తగ్గించవచ్చని, తద్వారా భూమి ఉపరితలంపైకి ఉబికివచ్చే అలల ఎత్తును కూడా తగ్గించవచ్చని ఆయన వెల్లడించారు. తీరప్రాంతాన్ని సునామీ తాకే లోపు దాని ఎత్తును తగ్గించగలిగినట్లయితే పర్యావరణ నష్టంతోపాటు ప్రాణనష్టం కూడా తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సునామీ సంభవించేటప్పుడు ఈ తరంగాలను నిరంతరం ప్రయోగించడం ద్వారా సునామీని పూర్తి స్థాయిలో అదుపు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News