: పవన్‌కల్యాణ్ ట్విట్టర్‌లో రెచ్చగొడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: ఏపీ మంత్రి మాణిక్యాలరావు
తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌పై ఏపీ మంత్రులు విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో అభిమానులను రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తే వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సాయంతో రాష్ట్రాభివృద్ధికి అడుగులు పడుతున్నాయని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం వెనక ఆయన కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు.