chandrababu: రాబోయే రోజుల్లో విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
దేశంలో ఉత్తమమైన నగరం విశాఖపట్నం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహిస్తోన్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో మానవ వనరుల్లో భారత్‌కు పోటీ ఉండదని చెప్పారు. దేశంలో సమర్థవంతమైన నాయకత్వం ఉందని అన్నారు. ఐటీ రంగంలో భారత్ ముందుందని చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
పెద్దనోట్ల రద్దు తరువాత కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి భారత్ పుంజుకుంటోందని అన్నారు. దేశంలో అవినీతి తగ్గుతోందని చెప్పారు. భారతీయులు ఎంతో కష్టపడి పనిచేస్తారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటులో దూసుకుపోతోందని అన్నారు. పెద్దనోట్లరద్దుకు ప్రజలు సహకరించారని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుందని, జీఎస్‌టీ వల్ల దేశంలో ఒకే రకమైన పన్ను విధానం రానుందని తెలిపారు.