: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కరీంనగర్ లో ధర్నాలు.. నిరసనలు
తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీ యువత చేస్తున్న ఆందోళనలకు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తోంది. వివిధ పార్టీలు ఏపీకి స్పెషల్ స్టాటస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి హోదాను కోరుతూ కరీంనగర్ లో నిరసనలు జరిగాయి. వైకాపా నేతలు పలువురు రహదారులపై ఏపీకి హోదా కోసం ధర్నాలకు దిగారు. తెలంగాణ చౌక్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి, హోదా ఇవ్వాల్సిందేనని నినాదాలు చేశారు. హోదా కోసం నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉందని, దాన్ని గమనించి, నిరసనలను తొక్కివేయాలన్న ఉద్దేశాన్ని విడనాడాలని వారు కోరారు.