: తరగతి గదిలోనే తీవ్రంగా కొట్టుకున్న పదో తరగతి విద్యార్థులు.. ఓ బాలుడి మృతి
ఇద్దరు పదోతరగతి విద్యార్థులు తరగతి గదిలో తీవ్రంగా కలబడడంతో వారిలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈరోజు ఉదయం ఇంటర్వెల్ కాగానే భానుప్రకాశ్(15) అనే విద్యార్థి మరో విద్యార్థితో గొడవ పడ్డాడు. అనంతరం ఇంటర్వెల్ సమయం ముగియడంతో తరగతికి వెళ్లిన అనంతరం కూడా వారిరువురూ గొడవపడి కొట్టుకున్నారు. భాను ప్రకాశ్‌తో గొడవపడిన మరో విద్యార్థి అతడి మర్మావయవాలపై బలంగా కొట్టడంతో భానుప్రకాశ్ అక్కడే కుప్పకూలిపోయాడు. పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం మేరకు పాఠశాలకు చేరుకున్న పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు.