: సంప్రదాయ క్రీడ కంబళ కోసం క‌ర్ణాట‌క‌లో ఊపందుకున్న ఆందోళ‌న‌లు


త‌మిళ‌నాడు సంప్ర‌దాయ క్రీడ జల్లికట్టుపై పోరాటం స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో ఉత్తేజితులైన‌ కర్ణాటక ప్రజలు కూడా వారి సంప్రదాయ క్రీడ కంబళ కోసం పెద్ద ఎత్తున నిరస‌న‌ల‌కు దిగుతున్నారు. ఈ రోజు హుబ్లి, మంగళూరుతో పాటు ప‌లు ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి కంబ‌ళ‌కు అనుమ‌తినివ్వాల‌ని ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. అంతేగాక‌, పెటాపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర బీజేపీ నేత యడ్యూరప్ప కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంపై లేఖ రాశారు. అలాగే కంబళపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  ఆ క్రీడ త‌మ రాష్ట్ర  సంప్రదాయ క్రీడ అని, దాని కోసం త‌మ‌ ప్రభుత్వ మద్దతు ఉంటుందని, ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు కృషి చేస్తామ‌ని తెలిపారు. గేదెలతో నిర్వహించే పరుగు పందేల‌ని కంబ‌ళ పేరుతో ఆ రాష్ట్రంలో నిర్వ‌హిస్తార‌న్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News