: అమెరికాపైకి మళ్లిన రాంగోపాల్ వర్మ దృష్టి... ఓటేసిన అమెరికన్లు మూర్ఖులా? లేక గెలిచిన ట్రంప్ మూర్ఖుడా? అంటూ ప్రశ్నాస్త్రాలు!
ఏపీ రాజకీయాలను, ఇక్కడ జరుగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమాలను, తాను వదులుతున్న ట్వీట్లను పక్కనబెట్టిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దృష్టి అమెరికా వైపు మళ్లింది. తానిప్పుడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో డేవిడ్ మూయిర్ చేసిన ఇంటర్వ్యూను చూసి దిగ్ర్భాంతికి గురయ్యానని చెప్పాడు. ఇంత మూర్ఖుడిని అమెరికా అధ్యక్షుడిగా ఎలా ఎన్నుకున్నారో తెలియడం లేదని అన్నాడు. ట్రంప్ ను ఎన్నుకున్న అమెరికన్లు పెద్ద ఇడియట్లా? లేక, ఇడియట్లు ఎన్నుకున్న ట్రంప్ ఇంకా పెద్ద ఇడియట్టా? అన్న విషయం అర్ధం కావడం లేదని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టాడు. మూర్ఖులు ఎవరో తెలియడం లేదని అన్నాడు.