: ఇంగ్లండ్ తో తొలి టీ-20లో జాతీయ గీతాన్ని అవమానించిన క్రికెటర్ పర్వేజ్ రసూల్... నెట్టింట తీవ్ర విమర్శలు


ఎన్నో అవమానాలను భరించి తొలిసారిగా టీ-20 మ్యాచ్ లో చోటు సంపాదించుకున్నాడన్న అభినందనలను అందుకున్న జమ్మూ కాశ్మీర్ యువ క్రికెటర్ పర్వేజ్ రసూల్, నిన్నటి ఇంగ్లండ్ తో తొలి టీ-20 సందర్భంగా తన ప్రవర్తనతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ఆలపించగా, పర్వేజ్ నిర్లక్ష్యంగా ఉండటం ప్రత్యక్ష ప్రసారంలో చూసిన ఎంతో మంది సోషల్ మీడియాలో అతనిపై నిప్పులు చెరుగుతున్నారు. 'జనగణమన' పాడుతున్న సమయంలో చ్యూయింగ్ గమ్ నములుతూ పర్వేజ్ కనిపించడమే ఇందుకు కారణం.

కాగా, ఇటీవలి రంజీ ట్రోఫీ మ్యాచ్ లలో అద్భుత ప్రతిభ కనబరిచిన రసూల్ తొలిసారిగా టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే. గతంలో అండర్-22 జట్టులో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆడేందుకు వెళ్లిన రసూల్ వద్ద పేలుడు పదార్థాలు ఉన్నాయని భావించిన పోలీసులు, అతన్ని అడ్డుకుని అణువణువూ సోదాలు చేసిన వేళ, పూర్తి భారతావని అతనికి ఎదురైన అవమానాన్ని నిరసిస్తూ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆపై ఎన్నోమార్లు పలు ప్రాంతాల్లో రసూల్ వైపు భద్రతా సిబ్బంది అనుమానంగా చూసిన సందర్భాలున్నాయి. చివరకు భారత జట్టులో స్థానం పొంది, తనలాంటి వాళ్లకు ఆదర్శంగా నిలవాల్సిన సమయంలో రసూల్ జాతీయగీతాన్నే అవమానించి విమర్శల పాలుకావడం గమనార్హం.

  • Loading...

More Telugu News