: పెళ్లయిన కూతురున్న వ్యక్తి, పోర్న్ చిత్రాలపై మాట్లాడే మనిషి... ఆయన గురించి ఇక నేనేం చెప్పాలి?: రాంగోపాల్ వర్మపై పవన్ కల్యాణ్
ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ ద్వారా, తనపై, తన కుటుంబంపై వ్యాఖ్యలు చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. తనకు రాంగోపాల్ వర్మపై గౌరవం ఉందని అంటూనే, గతంలో ఆయన గురించి మాట్లాడలేదని, ఇకపైనా మాట్లాడబోనని చెబుతూనే ఆయన వైఖరిపై నిప్పులు చెరిగారు. "దాదాపు 50 ఏళ్లు పైబడిన వ్యక్తి. ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు. పైగా పెళ్లి అయిన కూతురిని పెట్టుకుని, పోర్నోగ్రఫీ ఫిలింస్ నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పే వ్యక్తి గురించి నన్ను ఏం మాట్లాడమంటారు? ఇక నేను ఏం చెప్పాలి? ఒకరోజు నన్ను ఎత్తొచ్చు, ఒకరోజు నన్ను తగ్గించొచ్చు. అన్నింటిపైనా మాట్లాడలేను" అని అన్నారు.