: సొంత అన్నయ్యనే విభేదించాను...టీడీపీ - బీజేపీతో తెగదెంపులే: పవన్ సంకేతాలు


సుజనా వంటి వ్యక్తులను పక్కనెందుకు పెట్టుకున్నారని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. వ్యక్తిగతంగా సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావులు తనకు తెలుసునని, వారిపై గౌరవం ఉందని, వ్యక్తిగతంగా శత్రుత్వం, విభేదాలు లేవని చెబుతూనే, సమస్యల విషయానికి వస్తే తాను ఎవరినైనా ఎదిరిస్తానని స్పష్టం చేశారు.

 "ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల పక్షాన నిలబడటానికి నేను సొంత కుటుంబంతో, సొంత అన్నయ్యతో కూడా విభేదించి వచ్చిన వాడిని. అలాంటిది మీతో ఉన్న పరిచయమో, స్నేహమో... కలిసి ప్రయాణించినా దాన్ని విభేదించి బయటకు రావడానికి నాకేమీ ఇబ్బంది లేదు. దాన్ని గురించి ఆలోచించను. మీకూ నాకూ మధ్య ఉన్నది ఓ కామన్ ఎజెండా. ప్రజల కోసం పనిచేయడం. అది జరగనప్పుడు నేను ఎందుకు మీ పక్షం ఉండాలి? ఒక్కసారి నాకు చెప్పాలి. నాక్కాదు... ప్రజలకు చెప్పాలి" అని పవన్ తన మనసులోని భావాన్ని వెల్లడించారు. దీంతో తెలుగుదేశం, బీజేపీతో కటీఫ్ సంకేతాలు పవన్ నుంచి వచ్చినట్లయింది.

  • Loading...

More Telugu News