: బీజేపీ నిర్వాకంతోనే జల్లికట్టు ఉద్యమం... యువత చేయబోయే ఉద్యమంపై నాకు నెలముందే సమాచారం!: పవన్ నోటివెంట సంచలన వ్యాఖ్య


తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం మహోగ్రరూపంలో సాగుతుందన్న విషయం తనకు ముందే తెలుసునని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. తాను నెల రోజుల క్రితం తమిళనాడుకు షూటింగ్ కు వెళ్లినప్పుడు తనను కలిసిన పాత మిత్రులు కొందరు ఈ విషయాన్ని చెప్పారని, అక్కడ యువత మధ్య వాట్స్ యాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారాన్ని గురించి చూపించారని వివరించారు.

"జల్లికట్టు పెద్ద గొడవ అవుతుందని వారు ముందే చెప్పారు. ఎందుకు గొడవలు జరుగుతాయని అడిగితే, జయలలిత చనిపోయాక, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమిళనాడు రాజకీయాలను శాసించడం అక్కడి రాజకీయ నాయకులు, పార్టీలు ఒప్పుకోగలిగారేమో కానీ, అక్కడి యువత, ప్రజలకు ఇష్టం లేదని చెప్పారు. ఎందుకంటే, వాళ్లు దాన్ని తమ ద్రావిడ సంస్కృతిపై బీజేపీ చేస్తున్న దాడిగా పరిగణించారు. అందుకని వాళ్లు ఈ రూపంలో ఉద్యమించారు" అని చెప్పారు పవన్. బీజేపీ నిర్వాకం మూలంగానే తమిళనాడు యువతలోని సంఘటిత శక్తి బయటకు వచ్చిందని అన్నారు.

జల్లికట్టు ఉద్యమం అంటే ఎద్దులను లొంగదీసుకునే ప్రక్రియ లేదా తమిళనాడు సంస్కృతి కాదని, అక్కడి యువతకు బీజేపీపై ఉన్న కోపమని పవన్ వ్యాఖ్యానించారు. వాళ్ల నాయకులు బీజేపీని ఎదిరించలేక పోతుంటే, ఆ కోపం ఇలా బయటకు వచ్చిందని, జల్లికట్టు ఉద్యమాన్ని నిజంగా అర్థం చేసుకుంటే ఆ విషయం తెలుస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News