: గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారు... అందుకే జనసేన: పవన్ కల్యాణ్


కొన్ని దశాబ్దాలుగా మూలుగుతున్న సమస్యలను పరిష్కరించకుండా, డిలే చేసి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకువచ్చి, సమస్యలను పెంచడం వల్ల, అందుకు తనకు వచ్చిన ఆవేశం, ఆవేదనతోనే జనసేన పార్టీని పెట్టినట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు రాజకీయ నాయకుల్లో అవకాశవాద రాజకీయాలే కనిపిస్తున్నాయని నిప్పులు చెరిగారు. పదవిలోకి రాకముందు ఆకాశాన్ని తెస్తాం, చంద్రుడిని భూమ్మీదకు తెస్తాం అని ఆశలు కల్పించి, పదవుల్లోకి, అధికారంలోకి వచ్చాక వాటిని మరచిపోయి, కుంటిసాకులు చెప్పడం తనకు నచ్చలేదని అన్నారు. ఈ పరిస్థితి తనతో పాటు అనేక లక్షల మందికి ఆవేదన, బాధ కలిగించాయని పవన్ తెలిపారు. భిన్న సంస్కృతులు, భిన్న కులాలు... వీటిని అర్థం చేసుకోకుండా, వీటిని గౌరవించకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని నడపలేదని హెచ్చరించారు. పవన్ మీడియా ప్రసంగం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News