: పవన్ కల్యాణ్ ఏం చెపుతాడు?... సర్వత్రా ఉత్కంఠ!


ప్రత్యేక హోదా సాధన కోసం పవన్ కల్యాణ్ తదుపరి ఎటువంటి కార్యాచరణను ప్రకటిస్తారన్న విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిన్న తలపెట్టిన నిరసనలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగించి అణగదొక్కిన నేపథ్యంలో, జనసేనాని మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. ఉదయం 9:30 గంటల తరువాత పవన్ ప్రెస్ మీట్ కు రానుండగా, ఈ సమావేశంలో తన పోరు కార్యాచరణను ప్రకటిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి.

పవన్ మీడియా సమావేశంపై రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తి నెలకొంది. హోదా పోరాటంపై ముందడుగు వేస్తారా? లేదా ఎప్పటిలానే ప్రభుత్వంపై, ప్రశ్నలు గుప్పించి ఊరుకుంటారా? అన్న విషయం బహిర్గతమైన తరువాత స్పందిస్తామని అధికార పార్టీ నేత ఒకరు తెలిపారు.

ఇప్పటికే హోదా పోరుకు మద్దతుగా ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్ ను పవన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి పరిణామాలపై ఆయన ఏం మాట్లాడతారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికిప్పుడు నిరసనోద్యమాలకు దిగకుండా ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చి, హెచ్చరికలు చేయవచ్చని కూడా మరికొందరు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News