: ముస్లింల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన స‌మాజ్‌వాదీ పార్టీ యువ‌నేత ఫ‌ర్హాన్ అజ్మీ


ముస్లింల‌ను కండోముల‌లా వాడుకుంటున్నారంటూ స‌మాజ్‌వాదీ పార్టీ  యువ‌నేత‌, మ‌హారాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు అబూ అజ్మీ కుమారుడు ఫ‌ర్హాన్ అజ్మీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయ పార్టీలు ముస్లింల‌ను కండోమ్స్‌లా వాడుకుంటూ వ‌దిలేస్తున్నాయ‌ని వ్యాఖ్యానించి క‌ల‌కలం రేపారు. ముంబైలో జ‌ర‌గ‌నున్న బీఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌కు తండ్రితో క‌లిసి హాజ‌రైన ఫ‌ర్హాన్ పై విధంగా వ్యాఖ్యానించారు.

ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ముస్లింల‌ను కండోముల‌తో పోల్చ‌డం ద్వారా మొత్తం ముస్లిం మ‌తాన్నే అవ‌మానించారంటూ ముంబై బీజేపీ అధ్య‌క్షుడు హైదర్ ఆజం ధ్వ‌జ‌మెత్తారు. స‌మాజ్‌వాదీ పార్టీ వైఖ‌రిని ఆయ‌న మాట‌లు బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్నాయ‌ని ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ ప‌ఠాన్ ఆరోపించారు. అయితే తాను కించ‌ప‌రిచేందుకు ఆ మాట‌లు అన‌లేద‌ని, దేశంలో ముస్లింల ప‌రిస్థితి గురించి మాత్ర‌మే అన్నాన‌ని ఫ‌ర్హాన్ వివ‌ర‌ణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News