: ప్రొటోకాల్‌ను మ‌రోసారి ప‌క్క‌నపెట్టిన ప్ర‌ధాని.. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా వెళ్లి అభివాదం


ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మ‌రోమారు ప్రొటోకాల్‌ను ప‌క్క‌న‌పెట్టారు. గురువారం ఢిల్లీలోని రాజ్‌ప‌థ్‌లో నిర్వ‌హించిన గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు హాజ‌రైన ప్ర‌ధాని మైదానంలో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా న‌డుస్తూ అభివాదం చేశారు. గ‌తేడాది గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లోనూ ప్రొటోకాల్‌ను ప‌క్క‌న పెట్టిన ప్ర‌ధాని మ‌రోమారు గురువారం కూడా ప్రొటోకాల్‌ను ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల‌ను, భ‌ద్ర‌తా సిబ్బందిని ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. మోదీ ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి అభివాదం చెప్ప‌డంతో ప్ర‌జ‌లు కూడా ఆనందంతో చేతులెత్తి అభివాదం చేశారు.

  • Loading...

More Telugu News