: అబు హమ్జా తిరుమల వచ్చింది మత ప్రచారానికే.. విచారణలో బయటపడిన నిజం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రార్థన చేస్తూ పట్టుబడిన అబు హమ్జా విచారణలో వెల్లడించిన విషయాలు విని పోలీసులు ఉలిక్కిపడ్డారు. బంగ్లాదేశ్ మత గురువు సూచనతోనే తిరుమలలో మత ప్రచారం నిర్వహించేందుకు వచ్చానని పేర్కొన్నాడు. బుధవారం తిరుమలలో ప్రార్థన చేస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన హమ్జాను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తన గురువు ద్వారా తిరుమల ప్రత్యేకతను తెలుసుకుని మత ప్రచారం నిర్వహించేందుకే ఇక్కడికి వచ్చానని అంగీకరించాడు.
వ్యాపారం నిమిత్తం తాను గత కొంతకాలంగా తిరుపతి వచ్చి వెళ్తున్నట్టు పేర్కొన్న హమ్జా తిరుమల ప్రత్యేకతను తెలుసుకుని కొండపైకి వచ్చానని తెలిపాడు. అయితే మధ్యాహ్నం కావడంతో సమీపంలోని ఖాళీ స్థలంలో నమాజు చేశానని వివరించాడు. బంగ్లాదేశ్‌కు చెందిన కలేమజమీద్ మత సంస్థకు చెందిన ప్రొఫెసర్ అబ్దుల్ మజీద్ తన గురువని, ఆయన సూచనలతోనే తన కుటుంబం మత ప్రచారం చేస్తోందని వివరించినట్టు తిరుమల డీఎస్పీ మునిరామయ్య, సీఐ రామకృష్ణ వివరించారు.