: సుస్మితాసేన్‌కు అరుదైన గౌరవం.. మిస్ యూనివర్స్ పోటీలకు న్యాయనిర్ణేతగా ఆహ్వానం
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్‌కు అరుదైన గౌరవం లభించింది. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న ఈ బాలీవుడ్ హీరోయిన్‌కు 23 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ పోటీల నిర్వాహకుల నుంచి పిలుపొచ్చింది. ఈనెల 30న ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో మాల్ ఆఫ్ ఏసియా మెరీనాలో జరగనున్న 65వ మిస్ యూనివర్స్ పోటీల న్యాయనిర్ణేతల ప్యానెల్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. మిస్ యూనివర్స్ పీజెంట్ నిర్వాహకులు తనను గుర్తుపెట్టుకుని ఆహ్వానించడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సుస్మితా సేన్ వ్యాఖ్యానించింది.