: రాసలీలల గవర్నర్ ఔట్.. రాజీనామా చేసిన షణ్ముగనాథన్!
రాజ్‌భవన్‌ను రాసలీలకు కేంద్రంగా మార్చిన మేఘాలయ గవర్నర్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కార్యాలయాన్ని ఆయన క్లబ్‌గా మార్చేశారని, అమ్మాయిలు నేరుగా గవర్నర్ పడక గదికి వెళ్తున్నారని పేర్కొంటూ రాజ్‌భవన్ సిబ్బంది ప్రధాని మోదీకి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఓ మహిళ కూడా షణ్ముగనాథన్‌పై ఆరోపణలు చేశారు. గతేడాది రాజ్‌భవన్‌లోని పీఆర్వో పోస్టుకు దరఖాస్తు చేసుకున్న తనతో గవర్నర్ అసభ్యంగా ప్రవర్తించారని, కౌగలించుకుని ముద్దులు పెట్టుకోబోయారని ఆరోపించింది.
రాజ్‌భవన్‌ను అమ్మాయిల కార్యకలాపాలకు వేదికగా మార్చడంతోపాటు తమను మానసిక ఒత్తిడికి, అవమానాలకు గురిచేస్తున్న గవర్నర్‌ను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మొత్తం 98 మంది సిబ్బంది ఫిర్యాదుపై సంతకం చేసి ప్రధానికి పంపించారు. ఈ ఫిర్యాదును ప్రధానితోపాటు రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రి, మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాలకు కూడా పంపారు. తొలుత ఈ ఆరోపణలను షణ్ముగనాథన్ ఖండించారు. కొందరు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కొట్టిపడేశారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, పదవి నుంచి షణ్ముగనాథన్‌ను తొలగించాలంటూ సివిల్ సొసైటీ విమెన్ ఆర్గనైజేషన్ సంతకాలు చేపట్టడంతో మరోమార్గం లేక షణ్ముగనాథన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. గతంలో ఇవే ఆరోపణలతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డీ తివారీ పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే.