: చంద్రబాబు నాయుడు సిగ్గుతో తల దించుకోవాలి : హైదరాబాద్ లో జగన్
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ చేరుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ రోజు విశాఖపట్నంతో పాటు పలు చోట్ల జరిగిన పరిణామాలపై, ప్రభుత్వం చేసిన అన్యాయమైన పనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. ‘ప్రత్యేక హోదా కావాలని ప్రతి యువకుడు పోరాడుతున్నారు.. చంద్రబాబు పుణ్యాన ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఎన్నో చిన్న సూక్ష్మ పరిశ్రమలు మూతపడుతున్నాయి.. వరుసగా ఉద్యోగాలు పోతున్నాయి.. పిల్లలకు మళ్లీ ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా అన్నది ఒక సంజీవని అని తెలిసి కూడా హోదా మాట ఎవరి దగ్గరినుంచి వచ్చినా, హోదా కోసం పోరాటం చేసినా ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. హోదా కోసం పోరాటం చేయాల్సిన వ్యక్తే దాన్ని నీరు గారుస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు నీరుగార్చేలా ప్రవర్తిస్తున్నారు.. చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు’ అని జగన్ అన్నారు.