: 33 రకాల ముఖ్యమైన మందుల ధరల తగ్గింపు


33 ముఖ్యమైన మందుల రిటైల్ ధరలను 30 నుంచి 50 శాతం వరకు తగ్గిస్తున్నట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) తెలిపింది. మెడిసెన్లపై మ్యానుఫాక్చరర్స్ నిర్ణయించిన రేట్లను పాటించని కంపెనీలు డ్రగ్స్ ఆర్డర్, 2013 ప్రొవిజన్స్ కింద అధిక మొత్తంలో రెగ్యులేటరీ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తాజాగా ప్రకటించిన ఈ నిర్ణయంతో యాంటీ బయోటిక్స్, జలుబు, దగ్గుతో పాటు పలు రకాల మందుల ధరలు తగ్గనున్నాయి.

క్లిష్టమైన వ్యాధులకు సాధారణంగా వాడుతున్న మెడిస‌న్ల రేట్ల‌ను తగ్గించడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భ‌విష్యత్తులో కొత్త డ్రగ్లను కూడా ప్రైస్ రెగ్యులేషన్ కిందకు తీసుకొస్తామని అథారిటీ తెలిపింది. తాజాగా త‌గ్గించిన‌ 33 రకాల మెడిసిన్‌ల‌ను రెండు కేటగిరీల్లో విభజించి, 11 కొత్త రకం మందులను ప్రైస్ కంట్రోల్ కిందకు తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సమీక్షించిన ఈ 33 మందుల వివరాలను నేషనల్ లిస్టు ఆఫ్‌ ఎసెన్సియల్ మెడిసిన్లు, 2015లోకి చేర్చుతున్న‌ట్లు అథారిటీ పేర్కొంది.

  • Loading...

More Telugu News