: పెళ్లి పేరుతో హైదరాబాద్ లో ఆన్‌లైన్ మోసం... ఓ వ్యక్తి నుంచి రూ.50 లక్షలు స్వాహా
పెళ్లి పేరుతో ఆన్‌లైన్‌లో కొందరు తనను మోసం చేసినట్లు ఆస్ట్రేలియా వాసి హైదరాబాద్ లో సీఐడీకి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిరువురూ నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులని మీడియాకు చెప్పారు. ఈ కేసులో మరో మహిళ పరారీలో ఉందని అన్నారు. సదరు ఆస్ట్రేలియా వాసి నుంచి ఈ ముఠా రూ.50 లక్షలకు పైగా కాజేసినట్లు తెలిపారు. దీంతో సదరు నిందితుల బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ. 20 లక్షలను స్తంభింపజేసినట్లు అధికారులు తెలిపారు.