: నోట్లరద్దుకు ముందు ఎన్ని నోట్లు ముద్రించామో వెల్లడించలేం.. దేశ ప్రయోజనాలపై ప్రభావం చూపుతుంది: ఆర్బీఐ ప్రెస్


పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకునే ముందు ముందస్తు ప్రణాళికగా నవంబర్ 8కి ముందు రూ.2000, రూ.500 కొత్త నోట్లను ఎన్ని ముద్రించారంటూ సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్య‌క్తి అడిగిన ప్ర‌శ్న‌కు ఆర్బీఐ సబ్సిడరీ భారతీయ రిజర్వు బ్యాంకు నోట్(పీ) లిమిటెడ్, బెంగళూరు నుంచి స‌మాధానం రాలేదు. ఆ విషయాన్ని తాము వెల్లడించ‌లేమ‌ని చెప్పేసింది. ఆ విష‌యం చెబితే దేశ ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందని తెలిపింది.
 
ప్రస్తుతం దేశంలో నోట్ల కొర‌త క‌ష్టాలు కాసింత‌ త‌గ్గాయి. బ్యాంకులు, ఏటీఎంల‌లో ఖాతాదారుల‌ విత్ డ్రా ప‌రిమితిని రిజ‌ర్వు బ్యాంకు ఇంకా ఎత్తేయ‌లేదు. కొత్త‌ నోట్ల‌ను ముద్రించ‌డానికి ముద్ర‌ణా కేంద్రాల సిబ్బంది ఓవ‌ర్ టైమ్ చేశారు. 21 సంవత్సరాల క్రితం భారతీయ రిజర్వు బ్యాంకు నోట్(పీ) లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. రెండు షిఫ్ట్ల బేసిస్తో ఇది ఏడాదికి 16 బిలియన్ నోట్ల పీస్లను ముద్రించ‌గ‌ల‌దు.

  • Loading...

More Telugu News