: విశాఖపట్నంలోని పరిస్థితిని జగన్‌కు పూర్తిగా వివరించా.. ఆయన స్వచ్ఛందంగానే హైదరాబాద్ వెళ్లిపోయారు!: సీపీ యోగానంద్ వివరణ
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఈ రోజు నిర్వహించతలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లిన వైసీపీ అధినేత జగన్‌ను విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడంతో ఆయన అక్కడే బైఠాయించిన విషయం తెలిసిందే. దీనిపై సీపీ యోగానంద్ వివరణ ఇచ్చారు. తమ సిబ్బంది సరిగ్గా వివరించకపోవటంవల్లే జగన్ అక్కడే నిరసన తెలిపారని ఆయన అన్నారు. విశాఖపట్నంలోని పరిస్థితిని జగన్‌కు తాను పూర్తిగా వివరించానని తెలిపారు. నిబంధనల మేరకు జగన్‌కు పలు సూచనలు చేశానని, హైదరాబాద్ వెళ్లాలని చెప్పానని అన్నారు. దీంతో జగన్ స్వచ్ఛందంగానే హైదరాబాద్ వెళ్లిపోయారని తేల్చిచెప్పారు.