: కాన్పూర్ టీ20: ఇంగ్లండ్ టార్గెట్ 148
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత జట్టు 147 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు కోహ్లీ, కేఎల్ రాహుల్ (8) శుభారంభం ఇవ్వలేకపోయారు. కోహ్లీ (29) ఆకట్టుకోగా రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. నిలదొక్కుకునే క్రమంలో కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన రైనా ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అతనికి జతకలిసిన యువరాజ్ సింగ్ (12) వేగంగా ఆడే క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నించి రషీద్ ఒడిసిపట్టడంతో పెవిలియన్ చేరాడు. అనంతరం పుట్ వర్క్ లోపం కారణంగా రైనా (34) స్టోక్స్ బౌల్డ్ చేశాడు. ధోనీ (36) ధాటిగా ఆడుతూ చివరి వరకు క్రీజులో నిలిచాడు.
అనంతరం మనీష్ పాండే (3), హార్డిక్ పాండ్య (9), పర్వేజ్ రసూల్ (5) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో చివరి ఓవర్లో ధోనీ వేగంగా ఆడడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన భారత జట్టు 147 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో మెయిన్ అలీ రెండు వికెట్లు తీసి ఆకట్టుకోగా, జోర్డన్, ప్లంకెట్, మిల్స్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు. అనంతరం 148 పరుగుల విజయ లక్ష్యంతో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ఏడు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లు యజువేంద్ర చాహల్ ఖాతాలో చేరడం విశేషం.