DharaniUS: ధరణి వోబర్న్, మసాచుసెట్స్ - ఒరిజినల్ ఫ్లేవర్‌కు చిరునామా
యూఎస్ఏ, మసాచుసెట్స్, Jan 26th 2017 (Press Note): నోరూరించే రుచులు, ఆస్వాదించేందుకు అనుగుణమైన వాతావరణం, ప్రామాణికమైన రుచులు, అసలైన వంటకాలు, తాజా పదార్థాలతో చేసిన వంటకాలు, ఆహ్లాదకరమైన పచ్చళ్లు, ఘాటు మసాలాలు, మదిని తేలియాడించే సువాసనలు…. ఇలాంటివన్నీ జతకూడిన చోట చేసే భోజనం మధురానుభూతిని మిగుల్చుతుంది.
మేం కేవలం భారతీయ రుచుల రెస్టారెంట్ అందించడమే కాకుండా భోజన ప్రియుల మదిని దోచుకోవడంలో అంచనాలకు మించిన రీతిలో ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దాం. గతంలో ఎన్నడూ రుచి చూడని విభిన్న రుచులను ఆస్వాదించేందుకు చిరునామాగా మారిన ధరణి వూబర్న్ గురించి మరింతగా తెలుసుకోవాలంటే చదివేయండి మరి.
అద్భుతమైన స్థలం
రెస్టారెంట్ కొలువు దీరిన స్థలం అనేక విశిష్టతలను కలిగి ఉంది. ఆడంబరంగా, ప్రశాంతంగా ఉండేలా తీర్చిదిద్దడం ద్వారా మరే చోట లేని విభిన్న అనుభూతిని అతిథులు పొందుతారు. ఇంట్లో ఉన్నటువంటి అనుభూతిని పొందుతూ ప్రామాణికమైన భారతీయ రుచులను ఆస్వాదించవచ్చు.
6800 చదరపు అడుగుల సువిశాల ప్రాంగణంలో రెస్టారెంట్ ఏర్పాటుచేశాం. ఇంతటి స్థలాన్ని చక్కగా విభజించి అన్ని రకాల అవసరాలకు అనువుగా తీర్చిదిద్దాం. రెస్టారెంట్‌లోకి అడుగిడుతున్న ప్రాంగణంలోనే అద్భుతమైన డెకొరేషన్ తో హాల్ ను తీర్చిదిద్దాం. తర్వాత ఉన్న బాంక్వెట్ జోన్‌ను ప్రైవేట్ ఈవెంట్లకు కేంద్రంగా సుందరీకరించాం. బర్త్ డే సంబరాలు, ఆత్మీయ సమ్మేళనాలు, కుటుంబ వేడుకలు, సామూహిక సంబురాలు... వంటివి ఘనంగా జరుపుకోవచ్చు.
రెస్టారెంట్ చివరలో ఉన్న బార్ ... సుర ప్రియులకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చే విధంగా తీర్చిదిద్దాం. రోజంతా పని వల్ల కలిగిన ఒత్తిడి నుంచి విముక్తి పొందే విధంగా ఈ బార్ కొలువు దీరింది. మిత్రులతో చక్కటి పానీయాలను ఆస్వాదించేందుకు అనువుగా ఈ బార్ ప్రత్యేకంగా రూపొందించాం.
ప్రామాణిక రుచికరమైన భోజనం
రుచికరమైన భోజనం అద్భుతమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మా రెస్టారెంట్లో ప్రామాణికమైన రుచులతో పాటు ఆత్మీయంగా సిద్ధం చేసిన వంటకాలు జిహ్వలోని రుచుల పట్ల ఉన్న మమకారాన్ని తట్టి లేపుతాయి. ఈ రెస్టారెంట్ లో గతంలో ఏనాడూ రుచి చూడని ప్రామాణికమైన భారతీయ రుచులను, అద్భుతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆస్వాదించవచ్చు.
చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేయడం ద్వారా ప్రామాణికమైన చికెన్ బిర్యానీని ఆస్వాదించవచ్చు. భారతీయ మసాలా రుచులను విభిన్న రీతిలో మేళవించి అందించే చికెన్ దమ్ బిర్యానీ ద్వారా భారతదేశంలో బిర్యానీ తిన్న అనుభూతిని పొందవచ్చు. పురాతన&నూతన వంటక రీతులను మేళవించడం ద్వారా ఇక్కడ సిద్ధం చేసే బిర్యానీతో ప్రత్యేక రుచులను సొంతం చేసుకోవచ్చు.
చికెన్ ధమ్ బిర్యానీ ఒక్కటే ఈ రెస్టారెంట్ ప్రత్యేకత కాదు. గతంలో ఏనాడు రుచి చూడని నోరూరించే గోట్ సుఖ కూడా ధరణి రెస్టారెంట్ ప్రత్యేకత. ప్రామాణికమైన భారతీయ రుచిని మరిచిపోకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వంటకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రత్యేక రుచి జిహ్వను మైమరపించే అనుభూతిని కలిగిస్తుంది. భారతీయులు అత్యంత ప్రేమించే ఈ వంటకాన్ని ధరణి రెస్టారెంట్‌లో రుచి చూస్తే మరెన్నడు మరిచి పోని అనుభూతిని సొంతం చేసుకుంటారు.
మరో ప్రత్యేకతమైన నోరూరించే వంటకమైన గుత్తి వంకాయను ఆస్వాదించవచ్చు. తెలుగువారి నోరూరించే వంటకమైన గుత్తి వంకాయను మా రెస్టారెంట్‌లోని మాస్టర్ ఛెఫ్ అందరూ ప్రేమించే రీతిలో తీర్చిదిద్దడంలో నిపుణులు. అంతేకాకుండా 18 వెరైటీల దోశలను అందుబాటులో ఉంచడం ద్వారా అందరి ఆకాంక్షలకు తగిన రుచులు చేరువ అవుతున్నాయి.
అంతేకాకుండా విస్తృత శ్రేణిలో ఉన్న భారతీయ వంటకాలను అందించడం ద్వారా నోరూరించే రుచులను అతిథులు ఆస్వాదించవచ్చు. ధరణి రెస్టారెంట్ కు విచ్చేసిన అనేక రోజుల తర్వాత కూడా ఈ రుచులను నెమరు వేసుకునే రీతిలోఉంచారు. అపూర్వమైన విభిన్న వంటకాలను ఆస్వాదించడం ద్వారా కొత్త రుచులను స్వీకరించిన అనుభూతిని పొందవచ్చు.
నెలవారీ బఫెట్ మెనూను చూస్తే.... 50కి పైగా వంటకాలతో విస్తృతమైన శ్రేణి రుచులను రారమ్మని పిలుస్తుంటాయి. ఈ బఫెట్‌లో సాధారణ వంటకాలతో పాటు ప్రత్యేకమైన వంటకాలు పొందుపరిచి ఉన్నాయి. ప్రత్యేక వంటకాలను వినూత్న శ్రద్ధతో రూపొందిస్తున్నాం. ప్రతి సీజన్‌లో లభించే తాజా పదార్థాలను వంటకాల్లో భాగం చేయడం ద్వారా తాజా రుచులను ఆస్వాదించడమే కాకుండా మైమరపించే ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు. ప్రత్యేకంగా మీ కోసం రూపొందించిన
వంటకాల ద్వారా అనూహ్యమైన రుచులను జిహ్వకు అందజేయవచ్చు. ఇలాంటి భారతీయ వంటకాలను గతంలో మునుపెన్నడూ ఆస్వాదించలేదని మేం ఘంటాపథంగా చెప్పగలం.
సర్వీస్
చక్కటి స్థలం, మైమరపించే రుచులతో పాటుగా ఆత్మీయమైన సేవలను వ్యక్తిగతంగా అందజేయడం వల్ల అతిథులుగా వచ్చిన మీరు చక్కటి సేవలను పొందవచ్చు. ఉత్సాహంగా పనిచేయడంతో పాటు ఆతిథ్యం స్వీకరించడంలో మెరుగైన సూచనలు, సలహాలు అందించడానికి వెయిటర్స్ సదా సిద్ధంగా ఉంటారు. రెస్టారెంట్‌లోకి వచ్చిన సందర్భంగా ధరణిలో లభించే వంటకాలు, స్పెషల్ రుచుల గురించి మీకు సూచనలు చేయడం, ఆత్మీయంగా వడ్డించడంలో వెయిటర్స్ మెరుగైన శిక్షణ పొంది ఉన్నారు.
చేరువ
మధ్యాహ్న భోజన సమయం మొదలుకొని రాత్రి భోజనం వరకు ధరణి తెరిచి ఉంటుంది. వారంలో ఏడు రోజుల పాటు తెరిచి ఉంటుంది. మీరు కేవలం ఫోన్ లేదా ఈమెయిల్ చేయడం ద్వారా ధరణికి చేరువ కావచ్చు. వెబ్ సైట్‌లో అప్డేట్స్ చూసుకోవడం, ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ ద్వారా కూడా చేరువ కావచ్చు.
టీం ధరణి వోబర్న్ ఈ సందర్భంగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ "మీరు కోరుకున్న ప్రతి చోటా మేం ఉంటాం. ఇంటి భోజనం రుచిని ఆస్వాదించేందుకు, అద్భుతమైన రుచులను పొందేందుకు చక్కటి రెస్టారెంట్ ఉండాలి…. అంతేకాకుండా అది ప్రామాణికమైన రుచులకు, నాణ్యమైన సేవలకు కేంద్రంగా ఉండాలనే వినియోగదారుల ఆకాంక్షకు తగిన విధంగా ఉండేందుకు మా నిరంతర ప్రయత్నం కొనసాగిస్తాం. చక్కటి వంటకాలను అందించడం ద్వారా భోజన ప్రియుల మన్ననలను పొందేందుకు ముందుకు సాగుతాం" వోబర్న్ ధరణిలో వంటకాలు ఈరోజే రుచి చూడండి. వినూత్న అనుభూతిని పొందండి.
మీకు త్వరలోనే ఆత్మీయంగా వడ్డించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
చిరునామా
474 మెయిన్ స్ట్రీట్, వోబర్న్, మసాచుసెట్స్, 01801
ఫోన్: (781) 277-6707
ఈమెయిల్: woburn.ma@dharanius.com
వెబ్‌సైట్ : www.dharanius.com/woburn/
ఫేస్ బుక్ః www.facebook.com/woburndharani/
ధరణి వోబర్న్ గ్రాండ్ ఓపెనింగ్ సంబరాన్ని వీక్షించేందుకు ఈ వీడియోను క్లిక్ చేయండిః https://www.youtube.com/channel/UC79sx_DZgcMkXKFzXFAmg6Q
ఈ వీడియోను క్లిక్ చేయడంతో పాటు మా చానల్‌ను లైక్ చేయడం ద్వారా భవిష్యత్‌లో అప్ డేట్స్ పొందడాన్ని మర్చిపోకండి.
Press note released by: Indian Clicks, LLC