: వైసీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి హౌస్ అరెస్ట్


విజయనగరం జిల్లా కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి ఆమె బయటకు రాకుండా మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా కోసం యువత చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆమె వెళుతుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. జీయమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో ఉన్న ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. తమ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. 

  • Loading...

More Telugu News