: ప్రత్యేక ప్యాకేజీ మీ జేబులు నింపుకోడానికి కాదా?: వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్రత్యేకప్యాకేజీ ఇవ్వడం వెనుక అధికార పార్టీ హస్తం లేదా? అని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. విశాఖపట్టణంలో ఆమె మాట్లాడుతూ, విశాఖపట్టణంలో గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని అన్నారు. ప్రజలు, నేతలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ప్రజలకు నేరుగా కలిగే లాభం ఏంటో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. మీ జేబులు నింపుకోవడానికి ప్రజా ప్రయోజనాలు తాకట్టుపెడతారా? అని అధికారపార్టీ నేతలపై ఆమె మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. అంతవరకు యువతతో కలిసి పోరాడుతామని ఆమె అన్నారు. 

  • Loading...

More Telugu News