: ప్రత్యేకహోదా కంటే ఎక్కువ ప్రాజెక్టులు, నిధులు ఇస్తారు...ఇంకేం కావాలి?: రాయపాటి
ప్రత్యేకహోదా కంటే ఎక్కువ ప్యాకేజీ, నిధులు ఇస్తారు, ఇంకేం కావాలని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ విమర్శలపై ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని, అందుకే తన పేరు చెప్పి ఉంటారని అన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా డిమాండ్ ఉందని, మనం ప్రత్యేక హోదా అడిగితే మరో తొమ్మిది రాష్ట్రాలు ప్రత్యేకహోదా అడుగుతాయని అన్నారు. జల్లికట్టుకు, ప్రత్యేకహోదాకు సంబంధం లేదని ఆయన చెప్పారు. జల్లికట్టు ఆట అని, ప్రత్యేక హోదా ఆటకాదని ఆయన తెలిపారు.