: ఆ బంధాన్ని దీపికా పదుకునే ఒప్పేసుకుందా?


 బాలీవుడ్ భామ దీపికా పదుకునే నటించిన 'ట్రిపులెక్స్ రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' హాలీవుడ్ సినిమా సంక్రాంతి సందర్భంగా భారత్ లో విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది. త్వరలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచారం కోసం సినిమా యూనిట్ అమెరికాలో ఉంది. అక్కడి విశేషమైన ఆదరణ పొందిన టాక్ షో డిజెనరస్ లో పాల్గొన్న సందర్భంగా దీపికా పదుకునే ఆసక్తికర సమాధానాలు చెప్పింది. విన్ డీజిల్ తో తన అనుబంధం ఊహాజనితమైనదని తెలిపింది. అందులో పిల్లల్ని కన్నా ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. అయితే అది కార్యరూపం దాల్చేది కాదని స్పష్టం చేసింది. దీంతో డిజెనస్ మరో ప్రశ్నగా 'విన్ డీజిల్ తో నీకు శృంగార సంబంధం ఉందని అంతా అనుకుంటున్నార'ని అనగానే, 'నిప్పు లేనిదే పొగరాదు కదా?' అంటూ తెలివిగా సమాధానం చెప్పింది. అంటే వీరి మధ్య బంధం ఉందన్న విషయాన్ని దీపిక ఆ విధంగా అంగీకరించిందని బాలీవుడ్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి.  

  • Loading...

More Telugu News