: వైజాగ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరిన జగన్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై యువకులిచ్చిన పిలుపుకు ఏపీ విపక్షాలన్నీ మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్లేందుకు హైదరాబాదులోని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.
వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో నేటి సాయంత్రం జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీలో జగన్ తదితరులు పాల్గొంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైజాగ్ రావద్దంటూ ఏపీ డీజీపీ జగన్ కు సూచించారు. ఆయన సూచనను బేఖాతరు చేస్తూ జగన్ వైజాగ్ బయల్దేరడంతో అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్న ఆసక్తి అందర్లోనూ రేగుతోంది.