: గణతంత్ర దినోత్సవాన విషాదం.. మంచులో చిక్కుకొని ఆరుగురు జవాన్ల మృతి
గణతంత్రదినోత్సవం నాడు విషాదం చోటు చేసుకుంది. కశ్మీర్, గుర్జు సెక్టర్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో కురిసిన మంచు తుపాను ధాటికి ఆరుగురు బారత జవాన్లు మృతి చెందారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మంచులో చిక్కుకున్న మరో ఆరుగురు ప్రాణాలతో బయపడ్డారని వివరించారు. ఈ ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.