: జగన్ కాన్వాయ్ సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు


విశాఖపట్నంలో ప్రత్యేక హోదా కోసం ఈ సాయంత్రం జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని వైసీపీ అధినేత జగన్ ప్రటించిన సంగతి తెలిసిందే. సాయంత్రానికల్లా విశాఖ చేరుకునేందుకు ఆయన యత్నిస్తున్నారు. దీంతో, విశాఖలో ఉన్న వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో, పరవాడ వద్ద జగన్ కాన్వాయ్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు తిరుపతి, విజయవాడల్లో కూడా వైసీపీ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. 

  • Loading...

More Telugu News