: ఇరాక్ లా వైజాగ్... ఆర్కే బీచ్ పరిస్థితిని చూపుతూ ఫోటోను ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ


విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొని ఉందని దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. ఇరాక్ లా వైజాగ్ కనిపిస్తోందని చెబుతూ, ఆర్కే బీచే ఫోటోను ట్వీట్ చేశాడు. రోడ్డుపై బారికేడ్లు అడ్డంగా పెట్టి వాహనాలను బీచ్ రోడ్డుకు వెళ్లనీయకుండా చేసిన పోలీసులు, నిర్మానుష్యంగా ఉన్న రహదారి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి. పక్కనే అరెస్ట్ చేసిన వారిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన లారీలు, ఒకటి రెండు పోలీసు వాహనాలు మినహా మరే విధమైన జన సంచారమూ కనిపించడం లేదు. బీచ్ రోడ్డులో నెలకొన్న పరిస్థితిని చూపుతూ, తనకు దిగ్భ్రాంతి కలిగిందని వర్మ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News