: నువ్వే పందివి... నీతోనే గేమ్ స్టార్ట్!: సుజనా చౌదరిపై సినీ రచయిత చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు
జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు సంబంధం లేదని, జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకునే వారు కోళ్లు, పందుల పందాల పోటీలు పెట్టుకోవాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్ని కృష్ణ తీవ్రంగా మండిపడ్డాడు. "హోదాను అడ్డుకోవాలని చూస్తున్న సుజనా చౌదరే పంది" అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పందివైన నీతోనే గేమ్ మొదలు పెడతామని హెచ్చరించాడు. హోదా కోసం పోరాడుతున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని, అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని అన్నాడు. విద్యార్థుల అరెస్టుతో ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని చెప్పుకొచ్చాడు.