: 'బాహుబలి: ది కన్ క్లూజన్' పోస్టర్ విడుదల చేసిన రాజమౌళి!


విజువల్ వండర్ గా తెరకెక్కి 2015లో ప్రపంచ సినీ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన 'బాహుబలి: ది బిగినింగ్'కు కొనసాగింపుగా రాజమౌళి తీస్తున్న రెండో భాగం 'బాహుబలి: ది కన్ క్లూజన్' పోస్టర్ నేడు విడుదలైంది. అమరేంద్ర బాహుబలి (ప్రభాస్), దేవసేన (అనుష్క)లు విల్లు చేపట్టి బాణాలు సంధిస్తున్న దృశ్యంతో కూడిన ఫోటోతో ఈ పోస్టర్ ఉంది. దీన్ని రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు. ఈ స్టిల్ సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో వస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సినిమా వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి విడుదల చేసిన బాహుబలి-2 పోస్టర్ ను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News