: 'నో ట్రిపుల్ ట్రెబిల్'... సహచరుడు చేసిన పాపానికి అత్యంత అరుదైన రికార్డు కోల్పోయిన ఉస్సేన్ బోల్ట్


జమైకా పరుగుల చిరుత ఉస్సేన్ బోల్ట్ నెలకొల్పిన అత్యంత అరుదైన రికార్డు అతని సహచరుడి కారణంగా దూరమైంది. వరుసగా మూడు ఒలింపిక్ పోటీల్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4/100 రిలే విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి 'ట్రిపుల్ ట్రెబిల్' సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన బోల్ట్, 4/100 విభాగంలో టీమ్ మేజ్ నెస్టా కార్టర్ చేసిన తప్పుకు రికార్డును కోల్పోయాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ పోటీల్లో నెస్టా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడని తేలడంతో అప్పట్లో ఇచ్చిన బంగారు పతకాన్ని వెనక్కు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇచ్చిన ఈ తీర్పుపై సీఏఎస్ (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్)లో  అపీలు చేయనున్నట్టు కార్టర్ తరఫు న్యాయవాది స్టువార్ట్ స్టింప్సన్ తెలిపారు. ఆల్ టైం గ్రేట్ స్ప్రింటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న బోల్ట్, రికార్డు పదిలంగా ఉంచడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. కాగా, ఈ విషయంలో స్పందించేందుకు బోల్ట్ అందుబాటులో లేడని రాయ్ టర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News