: చంద్రబాబుకు ఢిల్లీలో ఏమైనా జరిగితే మేము బాధ్యత వహించలేం: ఎన్ఎస్ జీ


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు, ఆయనకు భద్రత కల్పించడం నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్ఎస్ జీ) సిబ్బందికి కత్తి మీద సాములా తయారైంది. ఢిల్లీ వెళ్లినప్పుడు ఏపీ భవన్ లోనే చంద్రబాబు బస చేస్తుంటారు. ఏపీ భవన్ వద్ద సరైన సెక్యూరిటీ లేదని... చంద్రబాబు అక్కడ బస చేసినప్పుడు మావోయిస్టులు దాడి చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. మరోవైపు, ఢిల్లీలో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రయాణం ప్లాన్ ప్రకారం కొనసాగడం లేదట. ఈ కారణం వల్ల బాబుపై దాడి చేసే అవకాశాలు పెరుగుతాయని వారు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఏపీ భవన్ సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు ఎన్ఎస్ జీ సిబ్బంది తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో, బాబుపై ఏదైనా దాడి జరిగితే, తాము బాధ్యత వహించలేమని చెప్పారు.

  • Loading...

More Telugu News