: భారత్ కు మరో గౌరవం... సూర్య నమస్కారాన్ని గుర్తించిన ట్రంప్ సర్కారు


అంతర్జాతీయ స్థాయిలో భారత సూర్య నమస్కారానికి అరుదైన ఘనత దక్కింది. అమెరికా ప్రతినిధుల సభ 'సూర్య నమస్కార్ యజ్ఞ'ను గుర్తిస్తూ తీర్మానం చేసింది. "మిస్టర్ స్పీకర్, హిందూ స్వయం సేవక్ సంఘ్ పదవ వార్షికోత్సవం సందర్భంగా 'సూర్య నమస్కార యజ్ఞ'ను గుర్తించాలని కోరుతున్నాను" అని ఇల్లినాయిస్ ప్రజా ప్రతినిధి బిల్ ఫోస్టర్ బుధవారం నాడు ప్రతినిధుల సభలో తెలిపారు. ఇది చాలా సులభమైన యోగాసనమని గుర్తు చేసిన ఆయన, శ్వాసకు సంబంధించిన మెళకువలను ఇది నేర్పిస్తుందని, ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుందని, మనసుకు సాంత్వన చేకూరుస్తుందని ఈ సందర్భంగా ఫోస్టర్ వ్యాఖ్యానించారు. కాగా, యోగా ఫర్ హెల్త్ అంటూ ఈనెల 14 నుంచి పదిహేను రోజుల పాటు హిందూ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించనున్న ప్రచారం 29తో ముగియనున్న సంగతి తెలిసిందే. యోగా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంఘం ఎంతో కృషి చేస్తోందని ఈ సందర్భంగా పోస్టర్ కొనియాడారు.

  • Loading...

More Telugu News