: విశాఖలో నటుడు సంపూర్ణేష్ బాబు అరెస్ట్


విశాఖలో యువత తలపెట్టిన మౌన ప్రదర్శనకు మద్దతిచ్చేందుకు తెలంగాణ నుంచి వచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబును ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్కే బీచ్ కి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా, బీచ్ రోడ్డులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబుకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీచ్ రోడ్డులో ఏ విధమైన ప్రదర్శనలకు అనుమతి లేదని, ఆ దారిలో స్థానికులకు తప్ప మరొకరికి ప్రవేశం లేదని ఈ సందర్భంగా పోలీసులు తేల్చి చెప్పారు.

ఆపై బలవంతంగా సంపూను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మరోవైపు తిరుపతిలో ఎస్వీ యూనివర్శిటీకి విద్యార్థులు ఒక్కొక్కరిగా చేరుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్దకు పోలీసుల బారికేడ్లను తప్పించుకుని మరీ కొందరు విద్యార్థులు వెళ్లి నిరసన ప్రదర్శన చేపట్టారు. వీరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. 

  • Loading...

More Telugu News