: విశాఖ చేరుకున్న హీరో సంపూర్ణేష్ బాబు... ఘన స్వాగతం పలికిన యువత!


ఏపీకి ప్రత్యేకహోదా కోసం యువత తలపెట్టిన నిరసన కార్యక్రమానికి సినీ హీరో సంపూర్ణేష్ బాబు మద్దతు పలికిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడినైనా... తెలుగురాష్ట్ర హోదా కోసం తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే సంపూ తెలిపాడు. ఈ నేపథ్యంలో, కాసేపటి క్రితం ఆయన విశాఖ చేరుకున్నాడు. సంపూకు అక్కడి యువత ఘన స్వాగతం పలికింది. తమ పోరాటానికి అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపింది.

ఈ సందర్భంగా సంపూ మాట్లాడుతూ, ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ, తెలుగువారంతా ఒక్కటేనని అన్నాడు. హోదా కోసం యువత చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరాడు. ఆర్కే బీచ్ లో సాయంత్రం జరగబోయే ఆందోళనలో పాల్గొంటున్నానని చెప్పాడు. 

  • Loading...

More Telugu News